UPDATED 26th OCTOBER 2019 SATURDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం సీనియర్ సివిల్ జడ్జి కం అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన ఎన్.వి.ఎస్. మూర్తి (బాలు) భాద్యతలు స్వీకరించారు. అనంతరం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు స్వీకరించిన మూర్తిని పెద్దాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేదుల సుబ్రహ్మణ్యం(మణి), న్యాయవాదులు సాదే నరసింహారావు, కె.వి. రాయుడు, సిహెచ్ కనకదుర్గారావు, గన్నంరాజు సత్యనారాయణ, కె.వి. చలం, జి.వి.ఎస్. నారాయణ, పిట్టా సుగుణారావు, ఎం. మొహిద్దీన్, దారా శ్రీనివాస్, బి.వి.ఎస్. లక్ష్మణరావు, చావలి కృష్ణారావు, డి.కె. జైన్, అళక్కి కృష్ణ, కె. కమలాకర్, షేక్ వల్లిబాబు, మడికి రాంబాబు, తటవర్తి సత్యనారాయణ, ఎన్. కాశీ సోమేశ్వరావు, వేమన అశోక్ కుమార్, సిహెచ్ శివరామకృష్ణ, బొండాడ శరన్న, డి.వి.ఎస్. రవికుమార్, డి.వి.ఎస్. ప్రకాష్, సకురు దుర్గారావు, తదితరులు అభినందించారు.







