పదిలో సత్తా చాటిన బాల గణితావధానికి అభినందనల వెల్లువ

UPDATED 30th APRIL 2018 MONDAY 11:00 AM

గండేపల్లి: బాల గణితావధాని తోటకూర వెంకట శివ సాయివంశీ పదవతరగతి పరీక్షా ఫలితాల్లో పది జిపిఎ పాయింట్లు సాధించి సత్తా చాటాడు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాషియర్, శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్ కుమారుడైన సాయివంశీ ఆదిత్య స్కూల్ లో విద్యను అభ్యసించాడు. ఈ సందర్భంగా గంగాధర్ విలేఖరులతో మాట్లాడుతూ సాయివంశీ ఇప్పటికే అనేక సందర్భాలలో మేజిక్ చదరాలు, గణితావధానాలతో ఆకట్టుకుని పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడని,  పదవ తరగతిలో సత్తా చాటడం ఆనందంగా ఉందన్నారు. సాయివంశీ మాట్లాడుతూ తల్లిదండ్రుల సహకారం, ఆదిత్య ఉపాధ్యాయ సిబ్బంది శిక్షణతో ఈ ఫలితాన్ని సాధించానని, ఐఐటి చదవాలనేది తన లక్ష్యమని తెలిపాడు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, సెక్రటరీ కృష్ణదీపక్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రముఖ గణితావధాని, రాష్ట్రపతి అవార్డు గ్రహీత తోటకూర సాయి రామకృష్ణ, తదితరులు సాయివంశీని అభినందించారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us