నృత్య, గాత్ర నీరాజనంలో ఆకట్టుకున్న ప్రసాద్ నృత్యప్రదర్శన

* విశిష్ట సేవా పురస్కారంతో ఘనంగా సత్కారం
UPDATED 16th JULY 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద శ్రీ లలితా కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య, గాత్ర నాద నీరాజనం-2018 కార్యక్రమంలో   సామర్లకోట పట్టణానికి చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు అలమండ ప్రసాద్ చేసిన నృత్య ప్రదర్శనలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ లలితా కల్చరల్ అసోసియేషన్ సాంస్కతిక, సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం, కధక్, జానపద నృత్యాలతో కూడిన నృత్య, గాత్ర నాద నీరాజనం కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విశ్రాంత  భరతనాట్య విభాగాధిపతి డాక్టర్ దేవేందర్ పిళ్ళై, నిర్వాహకురాలు సేవా సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ గన్నవరపు లలిత తదితరులు ఆయనను విశిష్ట సేవా పురస్కారం అందచేసి పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా  సత్కరించారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో కూచిపూడి నృత్య రంగంలో ప్రసాద్ చేస్తున్న సేవలను వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా నృత్యకారుడు ప్రసాద్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హెూంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి చంద్రరావు, వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ (చిన్ని), లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ చిత్తులూరి వీర్రాజు (రాజా), పారిశ్రామికవేత్తలు సింగవరపు సాయిబాబు, తులసీధరరావు సోదరులు, రోటరీ క్లబ్ నాయకుడు అంబటి సుబ్రహ్మణ్యం, కంచి మహా సంస్థానం చైర్మన్ చంధ్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి, శ్రీ వీరభద్ర జ్యోతిషాలయం నిర్వాహకులు చీమలకొండ వీరభద్రప్రసాద్ (ఆస్ట్రో ప్రసాద్), ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, తదితరులు అభినందించారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us