* విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల జిల్లా ఐక్యవేదిక వైస్ చైర్మన్ వీసం వీరనాగు
UPDATED 14th OCTOBER 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్య వేదిక పేరిట రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసినట్లు వీసం వీరనాగు తెలిపారు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఐక్యవేదిక నూతన కమిటీ వైస్ చైర్మన్ వీసం వీరనాగు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంట్రాక్టు విధానాన్ని రద్దుచేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తరహాలో మన రాష్ట్రంలో కూడా విద్యుత్ శాఖ ద్వారా నేరుగా జీతాలు అందేలా అమలుకు కృషి చేస్తానని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తోందని, ఈ విషయమై ప్రభుత్వంపై ఉద్యమించేందుకు ఈనెల 29న కాకినాడ సుందరయ్య భవన్ లో తూర్పుగోదావరి జిల్లా ఐక్యవేదిక సదస్సు జరగనుందని అన్నారు. ఈ సదస్సుకు రాష్ట్ర ఐక్యవేదిక చైర్మన్ ఎం. బాలకాశి హాజరుకానున్నారని, జిల్లాలో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు హాజరై ఈ సదస్సును విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో పరిశ్రమలు విస్తరిస్తునందున ఇపిఎఫ్, ఇఎస్ఐ పరిమితిని పెంచాలని అన్నారు. రాజమహేంద్రవరంలో గల ఇఎస్ఐ ఆసుపత్రి చాల దూరం అయినందున కార్మికులు అవస్థలు పడుతున్నారని, కాకినాడ సాంబమూర్తి నగర్ లో 100 పడకల ఇఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.







