అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయింపు

UPDATED 29th MARCH 2019 FRIDAY 6:00 PM

పెద్దాపురం: పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, వారికి ఎన్నికల గుర్తులు కేటాయించడం జరిగిందని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, అర్డీవో  ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. స్థానిక పాత్రికేయులతో అర్డీవో వసంతరాయుడు శుక్రవారం మాట్లాడుతూ తెలుగు అక్షరమాలను అనుసరించి ఎన్నికల కమీషన్ నిబంధనలు మేరకు బ్యాలెట్ పేపరులో వారి స్థానాలు, గుర్తులు కేటాయించామని తెలిపారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ) అభ్యర్థిని తోట సరస్వతి అనే వాణి (సీలింగుఫ్యాన్), భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల  దొరబాబు (హస్తం), తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప (సైకిల్), భారతీయ జనతాపార్టీ అభ్యర్థి యార్లగడ్డ రామ్ కుమార్ (కమలం), పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి వేటుకూరి అమ్మన్న  (ఫ్లూట్), జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర (గాజులు), జనసేన పార్టీ అభ్యర్థి తుమ్మల రామస్వామి (బాబు) (గ్లాస్ టంబ్లర్), ముందడుగు ప్రజాపార్టీ అభ్యర్థి దివిలి సతీష్ (టెలిఫోన్), జనజాగృతి పార్టీ అభ్యర్థిని కలిదిండి రమణమ్మ( మైక్), స్వతంత్ర అభ్యర్థి జోకా విజయకుమార్ (బకెట్) గుర్తులు కేటాయించేంపు జరిగినట్లు ఆర్వో తెలిపారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us