జిల్లా కలెక్టరును కలిసిన శ్రీ ప్రకాష్ విద్యార్థులు

UPDATED 6th NOVEMBER 2018 TUESDAY 9:00 PM

పెద్దాపురం: స్థానిక రామారావుపేటలో గల శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ విద్యార్థులు తూర్పుగోదావరి  జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రాను మంగళవారం కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగులతో అలంకరించిన ప్రమిదలు, గ్రీటింగ్ కార్డులతో పాటు కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడమంటూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు విత్తనాలు అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీపావళి సందర్భంగా భారీ బాణసంచా వలన జరిగే ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని, పర్యావరణహితంగా దీపావళిని జరుపుకోవాలని అన్నారు. శుభాలను ఆహ్వానించే దీపాల పండుగను కాలుష్య రహితంగా, సురక్షితంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, జ్ఞానానికి, ఆనందానికి, వికాసానికి, విజయాలకు దీపావళి ప్రతిరూపమని శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల డైరెక్టర్ సిహెచ్ విజయప్రకాష్ అన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us