UPDATED 11th JULY 2018 WEDNESDAY 8:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఫైనాన్స్ విభాగంలో ప్యానల్ చర్చను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ చర్చలో ప్రధానాంశంగా ఐసిఐసిఐ బ్యాంక్, వీడియోకాన్ ఋణ వివాదంలో విద్యార్థులు వివిధ గ్రూపులుగా విడిపోయి ఈ వివాదం గురించి ప్రధానంగా చర్చించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో గల లోపాలు విద్యార్థులు అధ్యాపకులు సమక్షంలో సరిదిద్దుకోవలసిన మార్గాలను సూచించారు. 2012 సంవత్సరంలో వీడియోకాన్ సంస్థ ప్రతినిధులు ఐసిఐసిఐ బ్యాంకు నుంచి వ్యాపార అభివృద్ధికి రూ. 3250 కోట్లు రుణాలు తీసుకొన్నారని, అయితే వాయిదాల రూపంలో చెల్లించడంలో విఫలం అయ్యారని బ్యాంకు ప్రతినిధులు వివరించారు. ఈ సమస్యకు గల నివారణా మార్గాలను గురించి విద్యార్థులు చర్చించారు. ఈ చర్చలో న్యాయనిర్ణేతలుగా అధ్యాపక సిబ్బంది శైలజారావు, డి. విజయలక్ష్మి వ్యవహరించి ఉత్తమంగా విశ్లేషించిన ప్యానల్ ను విజేతలుగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి విజేతలుగా ఎంపికైన మొదటి ప్యానల్ విద్యార్థులు ఎం. సింధూజ, హెచ్. సాయిసత్య, రెండవ ప్యానల్ విద్యార్థులు ఎం. భరద్వాజ్, ఆర్. పవన్ కుమార్ లను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి చర్చలలో పాల్గోవడం వల్ల సరైన అవగాహన, విషయ పరిజ్ఞానం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఆస్థాశర్మ, ద్వితీయ, తృతీయ సంవత్సర బిబిఏ విద్యార్థులు పాల్గొన్నారు.







