21 వ రోజుకు చేరుకున్న ఆశా వర్కర్ల దీక్ష

గంగవరం (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022 : మరణించిన ఆశావర్కర్లు కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారం ఇచ్చి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ తో గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట  ఆశాలు చేస్తున్న రిలే దీక్షలు సోమవారం నాటికి 21వ రోజుకు చేరుకున్నాయి.. ఈ సందర్భంగా  సంఘ నాయకులు మార్తమ్మ, మంగాయమ్మ మాట్లాడుతూ ఇప్పటివరకు గిరిజన సంఘాలు, యూటిఎఫ్ తదితర సంఘాలు మద్దతు తెలుపుతున్నా, అధికారులు, ప్రభుత్వం తమ దీక్షలను భేఖాతరు చేయటం లేదని, ఇది సరికాదని వారు అన్నారు. ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం అశాడే నాడు రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ ఆందోళనలు చేపట్టడం జరుగుతుందన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us