UPDATED 22nd JULY 2019 MONDAY 6:00 PM
పెద్దాపురం: పెద్దాపురం రెవెన్యూ డివిజినల్ అధికారిగా ఎస్. మల్లిబాబు సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ప్రస్తుతం ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం స్థానిక విలేఖరులతో మల్లిబాబు మాట్లాడుతూ జిల్లాలో సెట్రాజ్ సిఇవోగా భాద్యతలు నిర్వహించి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు పెద్దాపురం డివిజన్ ఆర్డీవోగా బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు. జిల్లాలో డిఆర్డీఏ పిడిగా, పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగిగా కూడా విధులు నిర్వర్తించానని, డివిజన్లో పరిస్థితులపై అవగాహన ఉందని తెలిపారు. డివిజన్ పరిధిలోని శాసన సభ్యులు, వివిధ శాఖల ఉద్యోగులు, ప్రజల సహకారంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు విజయవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా దళిత ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, కార్యదర్శి బాతు ప్రకాశరావు, ఉపాధ్యక్షుడు సుధాకర్, బహుజన సమాజ్ పార్టీ నాయకులు పెనుమాక ఎజ్రా, డిప్యూటీ తహసీల్దార్ టి. కృష్ణారావు, ఆర్ఐ తేజ, రెవిన్యూ సిబ్బంది, తదితరులు ఆర్దీవోను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.







