ఆదిత్యలో జాతీయస్థాయి గో- కార్ట్ రేసింగ్ పోటీలు

UPDATED 12th FEBRUARY 2018 MONDAY 6:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు జాతీయ స్థాయి గో-కార్ట్ రేసింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "సీజర్ ప్రో కార్టింగ్ ఛాంపియన్ షిప్ -2018"  పేరిట నిర్వహించే ఈ పోటీలలో దేశవ్యాప్తంగా 27 కళాశాలలకు చెందిన ఏడు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలు 14 ఉదయం పది గంటలకు ప్రారంభమై, 17 ఉదయం 11 గంటలకు ఫైనల్ పోటీలు జరుగుతాయని, అనంతరం విజేతలకు ట్రోఫీని బహూకరిస్తారన్నారు. విద్యార్థులు స్వయంగా తయారుచేసిన గో- కార్ట్ వాహనాల వేగం, బ్రేకింగ్ సిస్టం, లోడింగ్, పెట్రోల్ కంజక్షన్, పికప్ తదితర అంశాలలో పరీక్షించి విజేతలను నిర్ణయిస్తారన్నారు. గత సంవత్సరం నిర్వహించిన ఈ పోటీలలో నాలుగు వందల మంది పాల్గొన్నారని,  ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఏడువందల మంది పాల్గొనే ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామ కృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us