చదువుతోపాటు సమాజ ఔన్నత్యానికి కృషిచేయాలి

UPDATED 9th MAY 2018 WEDNESDAY 9:00 PM

రాజానగరం: ప్రతీ ఒక్కరూ చదువుతోపాటు సమాజ ఔన్నత్యానికి కృషిచేయాలని ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని కె.ఎల్.ఆర్. లెనోరా దంత వైద్య కళాశాలను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సమాజంలో రోజు రోజుకూ స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులపై మహిళల్లో చైతన్యం కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఎడ్యుకేట్ ఇన్ స్పైర్ ఎం పవర్ పేరుతో చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నామని, దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని కళాశాలలు సందర్శించి మహిళలు, విద్యార్థినులకు చైతన్యం కల్పిస్తామన్నారు. స్త్రీశక్తి అపారమని, విద్యార్థినులు చదువుతోపాటు సమాజ ఔన్నత్యానికి కృషిచేయాలని అన్నారు. ఈ కళాశాల చైర్ పర్సన్ ఒక స్త్రీ అని, సుమారు 34 కళాశాలలు, పాఠశాలలు ఆమె నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇటీవల కాలంలో మీడియాలో వస్తున్న అసంఘటిత చర్యలను గమనించి ముందుచూపుతో మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి, కార్యదర్శి వై. మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు జి.నాగార్జునరెడ్డి, ఎ. ప్రసాద్ చౌదరి, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ పూజిత, డాక్టర్ రూప, డాక్టర్ వైష్ణవీదేవి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us