UPDATED 16th SEPTEMBER 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మద్దాల శ్రీను 54వ జన్మదినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక లయన్స్ క్లబ్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై కేక్ కట్ పూలమాలలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మద్దాల శ్రీను మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఇంతమంది అభిమానులు, కార్యకర్తల మధ్య పుట్టిన రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంతటి గుర్తింపు రావడానికి ప్రజల అభిమానమే కారణమన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి నా వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాళ్ల లక్ష్మీనారాయణ, ఆవాల లక్ష్మీనారాయణ, కంటే వీరఘవరావు, మేకా శ్రీనివాస్, సేపేని సురేష్, కానుబోయిన విజయకృష్ణ, గోపు మురళీ, కానేటి ఎలిజబెత్ రాణి, నేతల హరిబాబు, వాసంశెట్టి గంగ, శెట్టిబత్తుల దుర్గ, గంగిరెడ్డి కృష్ణమూర్తి, సత్యన్నారాయణ, కర్రి బుజ్జి, పేర్నేటి రాయుడు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.







