అన్ని కులాలు,మతాలు ఉంటేనే రాజధాని

UPDATED 25th DECEMBER 2020 FRIDAY 10:00 PM

రాజమండ్రి (రెడ్ బీ న్యూస్): జిల్లాలోని కొత్తపల్లి మండలం కొమరగిరిలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. వైఎస్‌ఆర్‌ జగనన్న ఇళ్ల పట్టాల పైలాన్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. అలాగే నవరత్నాలు- పేదలకు ఇళ్లు పథకాన్ని జగన్‌ ప్రారంభించారు. 15 రోజుల పాటు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది. లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణాల్లో సెంటు భూమిని ప్రభుత్వం కేటాయించింది. 68,361 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల రూపంలో ప్రభుత్వం ఇవ్వనుంది. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్ని కులాలు, మతాలు ఉంటేనే అది రాజధాని అవుతుందని.. ఫలాన కులం, మతం వారు ఇక్కడ ఉండొద్దంటే.. అది రాజధాని ఎలా అవుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సీఎం జగన్ ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్న అందరికీ 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లను కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపై రూ.4,287 కోట్ల అదనపు భారం పడుతుందని వ్యాఖ్యానించారు. కులం, మతం, ప్రాంతం, వర్గం ఏదీ చూడకుండా అర్హులైన అందరికీ ఇళ్లు కేటాయిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us