ఆదిత్యలో అకౌంటింగ్ టాలీ ప్యాకేజీపై అవగాహనా సదస్సు

UPDATED 16th NOVEMBER 2018 FRIDAY 6:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో అకౌంటింగ్ టాలీ ప్యాకేజీపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హైదరాబాదుకు చెందిన ప్రముఖ టాలీ కంపెనీ ఎజిఎం టాలీ ఎడ్యుకేషన్ ప్రయివేట్ లిమిటెడ్ అధికార ప్రతినిధి రఘు వైఎస్ పాల్గొని మాట్లాడారు. అకౌంటింగ్ టాలీ, జి.ఎస్.టి వ్యాపార నిర్వహణలో ఏవిధంగా ప్రముఖ పాత్ర వహిస్తుందో వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆన్ లైన్ వ్యాపార లావాదేవీల్లో టాలీ ఉపయోగిస్తున్నారని, తద్వారా గణాంకాలను అతి సులభంగా చేయవచ్చని అన్నారు. మనదేశంలో సుమారు 90% కంపెనీలు టాలీ ప్యాకేజీపైనే గణాంకాలు జరుగుతున్నాయని తెలిపారు. డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉందని, దాని ద్వారా వ్యాపార లావాదేవీలు సులభంగా గణించడానికి టాలీ అనే కొత్త ప్యాకేజీని వాడుకలోకి వచ్చిందని, తద్వారా సమయం, వ్యయం ఆదా చేయవచ్చని అన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి సదస్సుల్లో పాల్గోవడం ద్వారా వారు ఎంచుకొనే రంగంలో అవగాహనతో ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us