ఆదిత్య ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ క్యాంప్

UPDATED 30th JULY 2018 MONDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సురంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో సమ్మర్ ఇంటర్న్ షిప్ కార్యక్రమాలలో భాగంగా రంగంపేట మండలం పాత కోటపాడు, కొత్త కోటపాడు గ్రామాలలో స్వచ్ఛభారత్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, రోడ్లు, గ్రంధాలయం శుభ్రం చేశారు. అలాగే  గ్రామంలో మొక్కలు నాటి, ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసి, ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. వర్షాకాలం వచ్చే వివిధ రకాల వ్యాధుల గురించి వివరించి అవి దరిజేరకుండా తీసుకోవలసిన చర్యలు వివరించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ఆదిరెడ్డి రమేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు జె. బాలమోహన్ రాజు, ఎం. సోమిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us