ఆదిత్యలో జాతీయస్థాయి సాఫ్ట్ వేర్ గేమ్స్ పోటీలు ప్రారంభం

UPDATED 29th SEPTEMBER 2018 SATURDAY 7:00 PM 

గండేపల్లి: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్  కార్పోరేషన్, కజని యూనివర్సిటీ ఆఫ్ అప్లయిడ్ సైన్సెస్ (ఫిన్లాండ్) సహకారంతో ఈనెల 28 నుంచి 30 వ తేదీ వరకు మూడురోజుల పాటు స్థానిక ఆదిత్య విద్యాసంస్థల ప్రాంగణంలో ఇండియా గేమ్ సమ్మిట్ హార్డాన్-2018 పేరిట జాతీయస్థాయి సాఫ్ట్ వేర్ గేమ్ డెవలప్ మెంట్ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిన్లాండ్ దేశానికి చెందిన సీనియర్ గేమ్ డెవలపర్ జోయెల్ పార్తమెన్, ఆదిత్య విద్యాసంస్థల వైస్-చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రప్రధమంగా నాలుగు ప్రాంతాలలో జరుగుతుండగా ఢిల్లీలో మూడు ప్రాంతాల్లో నిర్వహించగా నాల్గవది ఆంధ్రప్రదేశ్ లో తమ విద్యాసంస్థల ప్రాంగణంలో జరగడం ఆనందంగా ఉందని అన్నారు. 150 మంది పాల్గొనే ఈ పోటీలు నిర్వహించడంలో కజని యూనివర్సిటీ ఆఫ్ అప్లయిడ్ సైన్సెస్ కు విశేష అనుభవం ఉందని, ఇందులో పాల్గొనే అభ్యర్థులు కంప్యూటర్లు, సెల్ ఫోనులో ఆడుకునే గేమ్స్ ను సాఫ్ట్ వేర్ ఉపయోగించి రూపొందిస్తారన్నారు. ఈ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని విజేతలుగా ప్రకటించి రూ. లక్ష రూపాయల వరకు బహుమతులు అందచేయడం జరుగుతుందని అన్నారు. ఫిన్లాండ్ దేశానికి చెందిన సీనియర్ గేమ్ డెవలపర్ జోయెల్ పార్తమెన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషనుకు చెందిన ఎం. సందీప్, బి. శివశంకర్, హరిప్రియ మన్నే సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలు విద్యార్థిలోని వినూత్న ఆలోచనలను వెలికితీసేందుకు, వాటిని ద్విగుణీకృతం చేసేందుకు ఎంతగానో దోహదపడతాయని, విద్యార్థులంతా పోటీ తత్వంతో ప్రతిభ కనబరిచి మంచి పరిజ్ఞానంతో పాటు బహుమతులను పొందడానికి అందరూ కృషి చేయాలని ఆయన అన్నారు. విద్యార్థిలోని సృజనాత్మక ఆలోచనలు, వారిలోని తృష్ణకు, సహనశీలతకు, ఎంత సమయం పనిపట్ల శ్రద్దతో నిబద్దతతో శ్రమిస్తున్నారు అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని వారికి గల నైపుణ్యాన్ని పరీక్షించడానికి, సృజనాత్మక భావాలతో విద్యార్థికి పోటీతత్వం అలవర్చడం ఈ ఇండియా గేమ్ సమ్మిట్ హార్డాన్-2018 ముఖ్య ఉద్ద్యేశ్యం అని సతీష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, టి-హబ్ హెడ్ బాబ్జి నీలం, అధ్యాపక సిబ్బంది, 26 కళాశాలలకు చెందిన 150మంది విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us