పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

UPDATED 3rd JULY 2017 MONDAY 5:00PM

సామర్లకోట: పర్యావరణ పరిరక్షణ అందరి  బాధ్యత అని శ్రీ శారద రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్ అన్నారు. సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో ఆయన జన్మదినోత్సవం సంధర్భంగా గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం శ్రీ శారదా సేవా సమితి ఆధ్వర్యంలో తన జన్మదినోత్సవం నాడు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు తమ పుట్టిన రోజున మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఆదినారాయణ, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us