ఆనూరులో ఉచిత వైధ్య శిబిరం

UPDATED 7th OCTOBER 2018 SUNDAY 9:00 PM

పెద్దాపురం: పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో ఆదిత్య డిగ్రీ కళాశాలకు చెందిన ఫోరెన్సిక్ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. శతాయు కిడ్నీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ యు. ప్రవీణ్ ఆధ్వర్యంలో వైద్యులు టిడిఎస్ స్వరూప్, పావని వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది రోగులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందచేశారు. ఈ సందర్భంగా ఆదిత్య బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, ఫోరెన్సిక్  కళాశాల ప్రిన్సిపాల్ ఇ. మోహన్, తదితరులు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు ఎం. గోవర్ధన్ రెడ్డి, టి. ప్రవీణ్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us