శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్స్ అందజేత

UPDATED 17th MARCH 2018 SATURDAY 10:00 PM

సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో జిల్లాలోని మహిళా సంఘాల ప్రతినిధులకు మూడు రోజుల పాటు వివిధ అంశాలపై ఇచ్చిన శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని విస్తరణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ ఎన్.వి.ఎస్.ఎస్ మూర్తి అన్నారు. ఈ సందర్భంగా శిక్షణను  పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీలు టి.ఎల్.ఎన్. కుమార్ రాజా, జె. రాంబాబు, డి. రామ్మోహనరావు, మహిళా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us