విస్తృతంగా కళాజాతాలు
గంగవరం (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: దోమల కారణంగా విజృంభించే సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కన్సల్టెంట్ చంటి, వైద్యాధికారి డాక్టర్ ఆనంద్ సత్యతేజ సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళాజాత ద్వారా బుధవారం మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గంగవరం, మర్రిపాలెం, కొమరవరం ఈ.రామవరం, పెద్ద అడ్డపల్లి గ్రామాల్లో కాకినాడకు చెందిన ఎం. రాణి కళాకారుల బృందం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ప్రసాద్, హెల్త్ విజిటర్స్ వెంకటరత్నమ్మ, విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.







