UPDATED 29th JULY 2019 MONDAY 9:00 PM
సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్, ఇన్ ఛార్జ్ దవులూరి దొరబాబు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి, వేద పండితులు ఆలయ మర్యాదల ప్రకారం ఆయనకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దొరబాబు స్వామివారి మూలవిరాట్, ఉపాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బాలాత్రిపురసుందరి అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేశారు. ఆలయ నంది మండపంలో వేద పండితులు సన్నిధిరాజు వెంకన్న, సన్నిధిరాజు సుబ్బన్న, చెరుకూరి రాంబాబు, వేమూరి సోమేశ్వరశర్మ తదితరులు వేదస్వస్థిచేసి ఆశీర్వచనం చేశారు. దొరబాబు వెంట దవులూరి సుబ్బారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి, మాజీ కౌన్సిలర్ ఆవాల లక్ష్మీనారాయణ, పుట్టా సూరిబాబు, నక్కా జానకి రామయ్య, శెట్టిబత్తుల దుర్గ, పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, సామర్లకోట ఎస్సై సుమంత్, తదితరులు ఉన్నారు.







