UPDATED 4th JUNE 2018 MONDAY 7:00 PM
సామర్లకోట: ప్రముఖ గణితావధాని, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయి రామకృష్ణ 54వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన శిష్యుడు సాయి వంశీ ఎటుకూడినా 54వచ్చే విధంగా గణిత చదరం (Majic square) రూపొందించి వినూత్నంగా తన గురువుకు శుభాకాంక్షలు తెలియచేశాడు. కాకినాడ ఆదిత్య ఐఐటి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం చదువుచున్న తోటకూర వి.ఎస్.ఎస్. సాయివంశీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ గణిత చదరంలో అడ్డువరుసలు సంఖ్యల మొత్తం, నిలువు వరుసలు సంఖ్యల మొత్తం, కర్ణాల మొత్తం కూడినా, అలాగే ఏ నాలుగు సంఖ్యలు కూడినా 54 వచ్చే విధంగా దీనిని రూపొందించానన్నాడు. గణితం అంటే తనకు ఎంతో ఇష్టమని, గణితంలో అవధాన ప్రక్రియ, వివిధ పర్వదినాలు, ప్రముఖుల, జాతీయ నాయకుల జన్మదినోత్సవాలలో గణిత చదరాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయటం తనకు ఎంతో ఇష్టమని, అందుకే తన గురువు జన్మదినోత్సవం సందర్భంగా ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నాడు.







