ఏపీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం

* అధ్యక్షుడుగా చంద్రదాసు,
* ప్రధాన కార్యదర్శిగా సుధాకర్
UPDATED 22nd AUGUST 2018 WEDNESDAY 6:30 PM
పెద్దాపురం: పెద్దాపురం నియోజకవర్గ  ప్రెస్ క్లబ్ (ఏపీయూడబ్ల్యూజే) నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటివరకూ కొనసాగిన కార్యవర్గ పదవీకాలం గడువు ముగియంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, పెద్దాపురం డివిజన్ అధ్యక్షుడు రాకుర్తి రాంబాబు ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు అడపా వెంకట్రావు, రెడ్డిపల్లి రమణమూర్తి (బుల్లియ్య) సమక్షంలో ఈ కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. అధ్యక్షుడిగా ఉప్పలపాటి చంద్రదాసు, ఉపాధ్యక్షుడిగా కోశెట్టి రాంప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా దేవరకొండ సుధాకర్, కోశాధికారిగా పెమ్మాడి వీరభద్రవర్మ, కార్యనిర్వాహక కార్యదర్శిగా పిడపర్తి విక్రమశాస్త్రి (విక్కీ), సహాయ కార్యదర్శిగా ఎలిశెట్టి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులుగా పచ్చాకుల లోవరాజు, గోవిందవల్లబుల సుబ్రహ్మణ్యం (సుబ్బు), బిక్కిన వెంకట్, చవ్వాకుల ఈశ్వరరావులను ఏకగ్రీవంగా తీర్మానించారు. నూతన కార్యవర్గం వచ్చే నెలలో ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు స్టేట్ కౌన్సిల్ సభ్యుడు రాంబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు బద్ది కుమార్, ఇర్షాద్ ఆలీ, విజయ్, శ్రీకాంత్ దేవు, వినాయక్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us