UPDATED 16th JULY 2020 THURSDAY 9:00 PM
గండేపల్లి (రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల గ్రంధాలయ విభాగం ఆధ్వర్యంలో ఫ్యూచర్ లైబ్రరీస్ రోల్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రొఫెసర్స్ అనే అంశంపై ఈనెల 18వ తేదీన వెబినార్ నిర్వహిస్తున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి పేర్కొన్నారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డిప్యూటీ లైబ్రేరియన్ డాక్టర్ వై.ఎస్.రావు, రూర్కెలా ఎన్ఐటి డిప్యూటీ లైబ్రేరియన్ డాక్టర్ భోజరాజు ఈ కార్యక్రమానికి రీసోర్స్ పర్సన్స్ గా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ కోవిస్-19 వైద్య సేవల ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేసిందని, భవిష్యత్తులో గ్రంథాలయ సేవల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి, ఎలాంటి సేవలు అందించాలి అనే విషయాలను తెలుసుకొనేందుకు ఈ వెబినార్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రంథాలయాధికారి, ప్రోగ్రాం ఆర్గనైజింగ్ సెక్రటరీ కె. అశోక్ కుమార్ మాట్లాడుతూ విభిన్న ఆలోచనలు, విజ్ఞానదాయకమైన కార్యక్రమాలను వినూత్నంగా ఆలోచించే ఆదిత్య విద్యా సంస్థలు ప్రస్తుత కరోనా లాక్ డౌన్ సమయంలో గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందనే యాజమాన్యం ఆలోచనలతో ఇటీవల విజయవంతముగా నిర్వహించిన క్విజ్ ప్రోగ్రాం స్పూర్తితో వెబినార్ నిర్వహించాలని ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఆదిత్య యాజయాన్యంతో పాటు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డిగ్రీ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ బిఇవిఎల్ నాయుడు సహకారం మరువలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రంథాలయ విభాగాధిపతులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.







