UPDATED 23rd FEBRUARY 2018 FRIDAY 8:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో మార్చి నెల ఐదు నుంచి ఎనిమిదవ తేదీ వరకు నాలుగు రోజుల జాతీయ సాంకేతిక సదస్సు స్ట్రైడ్స్ 2కె18 పోస్టర్ ను శుక్రవారం కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ కార్యక్రమం మంచి అవకాశం అన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూ ప్రసాద్ మాట్లాడుతూ 2009 నుంచి ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా విద్యార్థులు తమ ప్రతిభను చాటి చెప్పే విధంగా పోస్టర్లు, పేపర్లు, ప్రాజెక్ట్ డిస్ ప్లే, వంటి ఈవెంట్స్ తో స్ట్రైడ్స్ 2కె18 విజయవంతం చేయాలన్నారు. స్ట్రైడ్స్ కన్వీనర్ కళాశాల మెకానికల్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ వసంతలక్ష్మి ఈ కార్యక్రమ వివరాలను తెలియచేస్తూ మార్చి నెల ఐదు నుంచి ఎనిమిదవ తేదీ వరకు కళాశాలలోని అన్ని సాంకేతిక విభాగాలు వారి వారి కార్యక్రమాలను నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాథబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాల అధిపతులు, కాలేజ్ అకడమిక్ మెంబర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







