UPDATED 16th JULY 2019 TUESDAY 9:00 PM
పెద్దాపురం: ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులనే గ్రామ వాలంటీర్ల పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుందని ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఆనూరు, ఆర్.బీ. కొత్తూరు గ్రామాలకు చెందిన సుమారు 120 మంది అభ్యర్థులు గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణారావు, డీఈ రమేష్ బాబు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి, మండల ఇంజినీరు అప్పారావు, ఎంపీడీవో కార్యాలయం సూపరెంటెండెంట్ విప్పర్తి సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.







