ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం

గండేపల్లి (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (కాకినాడ) సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ సి. దుర్గరాజు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరాన్ని ఉద్దేశించి ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ తమ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. అలాగే భవిష్యత్తులో చేపట్టే వివిధ సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. తమ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాల వల్ల ఎంతోమందికి ప్రయోజనం చేకూరుతోందని, అత్యవసర పరిస్థితులలోనూ ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన రక్తం వారిని ఆదుకుంటుందని అన్నారు. ఈ శిబిరంలో 150 మంది విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే 130 మంది నుంచి రక్తనమూనాలను సేకరించారు. రక్తదాన శిబిరం కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన కళాశాల యాజమాన్యం, సిబ్బందికి, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్ధులు, రక్తదాతలకు డాక్టర్ వి. దుర్గరాజు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అప్పలరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తమ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, డిపార్ట్ మెంట్ ఎన్ఎస్ఎస్ ఇన్ ఛార్జ్ విద్యార్థుల తరుపున కో-ఆర్డినేటర్ గా పాల్గొన్న శ్రీరామ్ దీపక్, శ్రావణి, రత్నకుమారి, అభినందన్, ఏ.ధృవిత తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, కళాశాల డైరక్టర్ ఎం.వి. హరనాధబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, డైరక్టర్ ఎస్. శంభుప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. నరేష్, పి. రాజశేఖర ఫణీంద్ర, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us