UPDATED 24th SEPTEMBER 2017 SUNDAY 8:00 PM
రాయవరం: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవరోజు విజయదుర్గ అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులు ఆధ్వర్యంలో అమ్మవారికి పంచద్రవ్యాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు సామూహిక కుంకుమార్చనలో పాల్గొని అన్నపూర్ణ, దుర్గా అష్టోత్తర సహస్రనామాలు పఠించారు. అనంతరం గాడ్ ప్రసంగిస్తూ అన్నపూర్ణాదేవిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు, శుభాలుతో పాటు పాడిపంటలు సుభిక్షంగా పండుతాయని భక్తులకు వివరించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎర్రాప్రగడ రామకృష్ణ ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వి.వి.బాపిరాజు, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ (బాబి), తదితరులు పాల్గొన్నారు.







