UPDATED 13th NOVEMBER 2018 TUESDAY 6:00 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాల ఎంసీఏ విభాగం ఆధ్వర్యంలో చక్రద్వారబంధం గ్రామం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో మంగళవారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ఎంసీఏ విభాగాధిపతి తమిళ్ కోడి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. భారత ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నందున పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. విజేతలకు బహుమతులతో పాటు విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీఏ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.







