* ఏవో కొల్లి ద్వారకాదేవి
UPDATED 14th DECEMBER 2019 SATURDAY 5:30 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పంటల సాగులో విత్తన ఎంపికే కీలకమని మండల వ్యవసాయాధికారిణి కొల్లి ద్వారకాదేవి అన్నారు. వైఎస్సార్ పొలంబడి కార్యక్రమంలో భాగంగా ఇటీవల నియమించబడిన వీఏఏ, వీహెచ్ఎలకు పెద్దాపురంలో నిర్వహించబడిన శిక్షణా కార్యక్రమంలో ఆమె శనివారం మాట్లాడారు. ప్రస్తుతం రైతులు రబీ సాగుకు సమాయత్తమయ్యే పనిలో నిమగ్నమయ్యారని, ఇందుకోసం వారికి తగిన సూచనలు సలహాలను అందించాల్సిన బాధ్యత వీఏఏ, వీహెచ్ఎలపై ఉందన్నారు. ముఖ్యంగా వెదజల్లు సాగు, విత్తనశుద్ధి, ఎరువుల యాజమాన్యం, స్వల్పకాలిక రకాలు మొదలైన విషయాలపై వారికి అవగాహన కల్పించారు. అలాగే విత్తన శుద్ధి ఏవిధంగా చేయాలో వారికి ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ఎన్.వి.వి. ప్రసాద్, ఎంపీఈవో షేక్ బాలాజీ, వీహెచ్ఏ ఎం. చిలకమ్మ, వీఏఏ కొల్లి ఉదయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.







