విద్యా దీవెనకు రూ.67.97 కోట్లు

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021‌: సంబంధించి మూడో విడత సొమ్ము విద్యార్థుల తల్లుల ఖాతాకు జమ చేసే ప్రక్రియను వర్చువల్‌ విధానంలో మంగళవారం ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ హరికిరణ్‌, జడ్పీ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ మేయర్‌ సుంకర శివప్రసన్న తదితరులు హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు తొలి విడతలో రూ.66.30 కోట్లు, రెండో విడతలో రూ.69.10 కోట్లు, మూడో విడతలో రూ.67.97 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. కాకినాడ గ్రామీణంలోని మోహన్‌ డిగ్రీ కళాశాల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి పాత్రో సాయిప్రకాశ్‌ తన తల్లి పాత్రో అలివేలుమంగతో కలిసి వర్చువల్‌లో సీఎంతో మాట్లాడారు. అనంతరం ఈ పథకానికి సంబంధించి లబ్ధి చెక్కును కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు అందజేశారు. డీఆర్వో సత్తిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రంగలక్ష్మీదేవి, బీసీ సంక్షేమ శాఖ డీడీ మయూరి తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us