UPDATED 22nd JULY 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట పట్టణ గ్రామదేవతగా ప్రఖ్యాతిగాంచిన నూకాంబిక అమ్మవారు ఆదివారం తెల్లవారుజాము నుంచి శాకాంబరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏటా ఆషాడ మాసంలో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా అమ్మవారితో పాటు దేవాలయ ప్రాంగణం మొత్తం కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలను గుత్తులుగా కూర్చి అలంకరించారు. సత్తి అరుణ ఆధ్వర్యంలో లలితా సహస్రనామ, గీతా పారాయణాలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







