Phone Blast : బాబోయ్.. ఛార్జింగ్‌లో ఉండగా పెద్ద శబ్దంతో పేలిపోయిన ఫోన్, ముగ్గురికి తీవ్ర గాయాలు

Updated 16th April 2023 Sunday 11:10 pm

Phone Blast : మొబైల్ ఫోన్.. ఇప్పుడు అందరి జీవితాల్లో భాగమైపోయింది. చిన్న, పెద్ద.. పేద, ధనిక.. అనే తేడా లేదు. దాదాపు అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి. తిండి, నిద్ర లేకపోయినా ఉండగలరు. కానీ, చేతిలో ఫోన్ లేకుండా కాసేపు కూడా ఉండలేని వారు ఉన్నారు. అంతగా మొబైల్ కి అడిక్ట్ అయిపోయారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. దాదాపుగా అన్ని పనులు అయిపోతున్నాయి.

అందుకే, ఫోన్ కి అంతగా అడిక్ట్ అయ్యారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ ఫోన్లు బాంబుల్లా పేలిపోతున్నాయి. ప్రాణాలు తీసుకుంటున్నాయి. మొబైల్ ఫోన్లు పేలిపోయిన ఘటనలు అనేకం జరిగాయి. ఈ ప్రమాదంలో కొందరు గాయాలతో బయటపడితే మరికొందరు మృత్యుఒడికి చేరుకున్నారు.

తాజాగా రాజస్తాన్ లోని బికనీర్ లో మొబైల్ ఫోన్ పేలిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఛార్జింగ్ ఉన్న ఫోన్ ఒక్కసారిగా బాంబులా పేలింది. అంతే గుడిసెలో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా ముగ్గురు మంటల్లో చిక్కుకున్నారు. తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో బాలిక ముఖం కాలిపోయింది. యువకుడి రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. సెల్ ఫోన్ బ్యాటరీ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us