నట్టల నివారణ మందులు పంపిణీ

UPDATED 3rd JANUARY 2020 FRIDAY 5:30 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): జిల్లా పశుసంవర్ధకశాఖ, రిలయన్స్ ఫౌండేషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న నట్టల నివారణ మందులు పంపిణీ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.టి. శ్రీనివాసరావు అన్నారు. పెద్దాపురం అర్బన్, మండల పరిధిలోని గ్రామాల్లో సామూహిక అంతరపరాన్నజీవులు (నట్టల) నివారణ మందులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా శుక్రవారం పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 2 నుంచి 12వ తేదీ వరకు నట్టల నివారణ ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నట్టలతో గొర్రెలు, మేకల పొట్టలు లావుగా కనబడడం, దవడ కింద నీరు చేరడం, ఆకలి లేకపోవడం, బరువు పెరగకపోవడం వంటి లక్షణాలు ఏర్పడి అనారోగ్యానికి గురై చనిపోయే ప్రమాదం ఉందని, ముందుగా నట్టల నివారణ మందులు వాడితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ శిబిరంలో సుమారు 1550 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు మందులు వేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వై. శ్రీనివాసరావు, రాయభూపాలపట్నం పశువైద్యాధికారి డాక్టర్ రాకేష్, రిలయన్స్ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ బర్రే నాగేశ్వరరావు, పశువైద్యశాల సిబ్బంది పి. దుర్గాప్రసాద్, పుష్పరాజు, గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us