UPDATED 21st MARCH 2018 WEDNESDAY 10:00 PM
రాజానగరం: సమాజసేవలో విద్యార్థులు భాగస్వాములు కావడం అభినందనీయమని కొత్త తుంగపాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దొడ్డా వీరన్న అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గైట్) అటానమస్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మండలంలోని కొత్త తుంగపాడు గ్రామంలో గత ఆరు రోజులుగా నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా బుధవారం పాల్గొని మాట్లాడారు. తమ గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఆయన అభినందించారు. అనంతరం వాలంటీర్లు గ్రామంలో స్త్రీ, పురుష అక్షరాస్యతపై సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ దుర్గారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం.వి. సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.







