ప్రతిభా అవార్డుకు సామర్లకోట విద్యార్థిని ఎంపిక

UPDATED 13th OCTOBER 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డుల్లో సామర్లకోట పట్టణానికి చెందిన బొడ్డు సుప్రియ ఎంపికైంది. గత సంవత్సరం అండర్-14, అండర్ -17, అండర్-19 విభాగాల్లో పలు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో జిల్లా నుంచి 39 మంది ఎంపికకాగా అందులో మార్షల్ ఆర్ట్స్ విభాగంలో సుప్రియ ఎంపికైంది. స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన సుప్రియ ప్రస్తుతం కెఎస్ఎన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రధమ సంవత్సరం చదువుతోంది. ఈ ప్రతిభా అవార్డులు ఈ నెల 15న ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రధానం చేస్తారని విద్యా శాఖాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సుప్రియను మండల విద్యాశాఖాధికారి వై.వి. శివరామకృష్ణయ్య, కళాశాల ప్రిన్సిపాల్ రాధాకృష్ణ, హెచ్ఎం శిరీష, పిఇటి శ్రీదేవి, ఐసిడిఎస్ అర్బన్ సిపిడివో పద్మావతి, సెక్టార్ సూపర్ వైజర్ బాలాత్రిపురసుందరి,  మున్సిపల్ కమీషనర్ సిహెచ్. వెంకటేశ్వరరావు,కరాటే కోచ్ శంకర్, లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్  ఈదల ఈశ్వర్ కుమార్, జోన్ చైర్మన్ చిత్తులూరి వీర్రాజు, క్లబ్ అధ్యక్షులు ఎం. విజయభాస్కర్ రెడ్డి, తదితరులు అభినందించారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us