కాకినాడలో ఆకస్మిక తనిఖీలు

కాకినాడ సిటీ,27 మే 2020 (రెడ్ బీ న్యూస్):నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉద్యోగులు తమ విధులు ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకున్నారు. పరిశుభ్రత పాటించాలని సూచించారు. రికార్డులు అన్ని సక్రమంగా ఉంచాలని, సిబ్బంది హుందాతనమైన వస్త్ర ధారణతో విధులకు హాజరు కావాలన్నారు. డిప్యూటీ కంట్రోలర్ గా పదోన్నతి.. తూనికలు కొలతల శాఖలో అసిస్టెంట్ కంట్రోలర్గా పనిచేస్తున్న సాలేం రాజు డిప్యూటీ కంట్రోలర్ గా పదోన్నతిపై గుంటూరు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కాకినాడశాఖకు ఏలూరులో పనిచేస్తున్న అసిస్టెంట్ కంట్రోలర్ సాయిరామ్ కు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. ఏస్. ఐలకు పోస్టింగులు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 35 మంది ఏఎస్ఐలకు పోస్టింగులు కల్పి స్తూ ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్ లు పొందిన వారు సంబంధిత పీఎస్ లో రిపోర్టు చేయాలని డీఐజీ ఆదేశించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us