ఆదిత్యలో రసవత్తరంగా సాగుతున్న ఫుట్ బాల్ పోటీలు

UPDATED 23rd NOVEMBER 2018 FRIDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల గ్రౌండ్స్ లో జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ సౌజన్యంతో ప్రారంభమైన ఫుట్ బాల్ లీగ్-2 పోటీలు ఎంతో రసవత్తరంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 180 మంది క్రీడాకారులతో 12 టీములు పాల్గొన్న ఈ పోటీలు లీగ్ పద్దతిలో సాగుతూ సెమీ ఫైనల్ స్థాయికి చేరుకున్నాయి. సెమి ఫైనల్ పోటీల్లో తలపడుతున్న టీమ్ సభ్యులను ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి పరిచయం చేసుకొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియచేశారు. క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆదిత్య ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్,  సిబ్బంది సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి ఫుట్ బాల్  అసోసియేషన్ కార్యదర్శి ఎస్. నాగేంద్రకిషోర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. గంగాధర్, ప్రిన్సిపాల్ డాక్టర్ శరభోజి, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us