చిన్నారులే దేశ భవిష్యత్తుకు పునాదులు

* లెనోరాలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

UPDATED 14th NOVEMBER 2018 WEDNESDAY 9:00 PM

రాజానగరం: నేటి చిన్నారులే రేపటి భారత దేశ భవిష్యత్తుకు పునాదులని కళాశాల డైరెక్టర్ జి. నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక లెనోరా దంత వైద్య కళాశాల చిన్నపిల్లల దంత వైద్య విభాగం ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్నిబుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 57 మంది పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే గురువులను, తల్లిదండ్రులను గౌరవించడం, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవడం సమాజాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. బాలలకు నైతిక విలువలతో కూడిన జీవితాన్ని అందించాలని, వారి హక్కులను కాపాడాలని, సమాజానికి మంచి పౌరులుగా అందించేందుకు వారికి ఉన్నత భవిష్యత్తు ఏర్పరిచేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని అన్నారు. అనంతరం బాలల  దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ అంశాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన బాలబాలికలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి, చిన్నపిల్లల దంత వైద్య విభాగం అధిపతి డాక్టర్ వి.వి. రావు, తదితరులు పాల్గొన్నారు.        

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us