UPDATED 26th FEBRUARY 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట: విద్యార్థులు భద్రతా నిబంధనలపై అవగాహనా పెంచుకోవాలని నవభారత్ వెంచర్స్ సుగర్స్ డివిజన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం. రాఘవయ్య అన్నారు. స్థానిక అయోధ్యరామపురంలోని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ అధ్యక్షతన భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు మంగళవారం ఆయన చేతుల మీదుగా బహుమతులు అందచేశారు. అనంతరం డిజిఎం రాఘవయ్య మాట్లాడుతూ ప్రతీ వ్యక్తి వ్యక్తిగత భద్రతపై అవగాహన కలిగి ఉండడం ద్వారా పూర్తి జీవిత కాలాన్ని చక్కగా పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి. గోవిందు, ఏ.ఎల్.వి. కుమారి, పిడి తాళ్లూరి వైకుంఠం, డివిఆర్ఎన్ వల్లి, కె. శ్రీనివాస్, భద్రావతి, చంద్రమోహన్, శివప్రసాద్, నవభారత్ వెంచర్స్ సిబ్బంది ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.







