అన్నివర్గాల అభివృద్ధికి జై భారత్ నేషనల్ పార్టీ కృషి

* పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర
* పెద్దాపురంలో పార్టీ కార్యాలయం ప్రారంభం

UPDATED 28th MARCH 2019 THURSDAY 6:00 PM

పెద్దాపురం : సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధికి జై భారత్ నేషనల్ పార్టీ కృషి చేస్తుందని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణంలో స్థానిక దర్గా సెంటర్ సమీపంలోని కొత్తపేటలో పార్టీ కార్యాలయాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ముందుగా ఆయనకు పార్టీ కార్యకర్తలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పార్టీ కార్యకర్తల నడుమ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం జై భారత్ నేషనల్ పార్టీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. తమ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ లభించిందని అన్నారు. అనంతరం పెద్దాపురం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు ఆయనకు పూలమాలలు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ప్రజలతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో తిరుగుతూ జై భారత్ నేషనల్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు. తాను స్థానికుడినని, తన బలమే స్థానికత అని అన్నారు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి అయిన తాను గెలిచిన వెంటనే నియోజకవర్గ పరిధిలో గల సామర్లకోట పట్టణంలో రెండవ ఓవర్ బ్రిడ్జి నిర్మించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. చెరుకు లారీలు, ట్రాక్టర్లు సామర్లకోట పట్టణం మీదుగా వెళ్లకుండా నేరుగా ఫ్యాక్టరీకి వెళ్లేందుకు బైపాస్ రోడ్డు నిర్మాణం, సామర్లకోటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాల, అలాగే ప్రభుత్వ నర్సింగ్, బీఈడీ కళాశాలల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో తన గుర్తు గాజులపై వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో కె. అబ్బాస్, బాబ్జి, వై.నాగబాబు, పి. సత్యశ్రీ, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us