మహిళను ఎరగా చూపి భారీ చోరీ

UPDATED 15th NOVEMBER 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ఓ ఫైనాన్స్ వ్యాపారికి మహిళను ఎరగా చూపి అసభ్య వీడియోలు, ఫోటోలు చిత్రీకరించి కొట్టి అతని వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు లాక్కొన్న ముఠా గుట్టును స్థానిక పోలీసులు రట్టు చేశారు. సామర్లకోట పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్దాపురం సిఐ శ్రీనివాస్ వివరాలను తెలియచేశారు. బిక్కవోలు మండలం గొల్లల మామిడాడలో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్న తాడి కేదార మణికంఠరెడ్డి, కాకినాడలో ఒక ఛానల్‌లో విలేఖరిగా పనిచేస్తున్న తేతలి దుర్గారెడ్డికి మధ్య స్థలం విషయంలో వివాదాలు ఉన్నాయి. మణికంఠ రెడ్డిని టార్గెట్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేయాలని భావించి ఒక మహిళను ఫోన్ ద్వారా మణికంఠ రెడ్డికి పరిచయం అయ్యేలా చేశారు. మణికంఠ రెడ్డికి, ఆ మహిళకు మధ్య పరిచయం పెరిగిన తర్వాత మణికంఠ రెడ్డిని సామర్లకోట పట్టణంలో గల మడికి అశోక్ అనే వ్యక్తి ఇంటికి ఈ నెల 7వ తేదీన వచ్చేలా ప్లాన్ చేశారు. మణికంఠరెడ్డి మహిళతో గదిలో ఉన్న సమయంలో వీడియోలు, ఫోటోలు చిత్రీకరించి నిందితులు మణికంఠరెడ్డిని బెదిరించారు. అతడు లొంగకపోవడంతో చిత్రహింసలకు గురి చేసి రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి రూ.50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సమయంలో అతని వద్ద ఉన్న రూ. 63 వేలు నగదుతో పాటు బంగారు ఆభరణాలు దోచుకొని ప్రామిసరీ నోట్లు, తెల్ల కాగితాలపై సంతకాలు, వేలిముద్రలు తీసుకుని పరారయ్యారు. ఈ విషయమై బాధితుడు మణికంఠ రెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈమేరకు నిందితులు ఆరుగుళ్ల మహేష్, నిమ్మకాయల సతీష్, తోట సందీప్, బొడ్డుపు రాజ్ కుమార్, ఏలుడుట్టి లక్ష్మీ నారాయణ, మడికి అశోక్ తో పాటు నిందితురాలైన మహిళను అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు కోసం గాలిస్తున్నామని సిఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో సామర్లకోట ఎస్ఐ సుమంత్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us