జాతీయ సమగ్రతకు హిందీ భాష దోహదం

UPDATED 27th AUGUST 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: జాతీయ సమగ్రతకు హిందీ భాష  ఎంతగానో దోహదపడుతుందని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ పేర్కొన్నారు. భాషా దినోత్సవ సంబరాల్లో భాగంగా రెండవరోజు స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మంగళవారం హిందీ భాషపై విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సాయిరామకృష్ణ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న మనదేశంలో వివిధ రాష్ట్రాల వారితో సామరస్యంగా జీవిస్తూ వారి సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడానికి హిందీ భాష ఉపయోగపడుతుందని, విద్యార్థులు దీనిపై పట్టు సాధించాలని అన్నారు. హిందీ భాషా పఠనం,  అభినయంతో కథలు చెప్పడం, చిత్రలేఖనం, తదితర అంశాలపై పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందీ ఉపాధ్యాయురాలు పిఎయస్ లక్ష్మి, ఐఎల్ ప్రవల్లిక, వి. రాజు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us