విద్యుతాఘాతంతో 30 గొర్రెలు మృతి

UPDATED 25th NOVEMBER 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట నుంచి ఉండూరు వెళ్ళే రహదారిలో సత్తెమ్మతల్లి ఆలయం సమీపంలో ఆదివారం ఉదయం విద్యుత్ వైర్లు తెగి గొర్రెల మందపై పడి 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం పరిసర గ్రామాలైన వన్నెపూడి. బెండపూడి, వాకదారిపేట గ్రామాలకు చెందిన ఐదుగురు గొర్రెల కాపరులు గొర్రెలకు మేత నిమిత్తం ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా గొర్రెల కాపరులు మాట్లాడుతూ కుటుంబ పోషణ నిమిత్తం గొర్రెలకు మేత నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చామని, జరిగిన సంఘటన వల్ల 30 గొర్రెలు చనిపోవడంతో రూ.నాలుగు లక్షల మేరకు నష్టం వాటిల్లిందని లబోదిబోమన్నారు. సంఘటనా స్థలాన్ని సామర్లకోట ట్రాన్స్ కో రూరల్ ఎఈ ఈశ్వరప్రసాద్ పరిశీలించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఇటువంటి సంఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయని పలువురు అంటున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us