UPDATED 17th MARCH 2018 SATURDAY 10:00 PM
సామర్లకోట: స్థానిక బ్రౌన్ పేటకు చెందిన లారీ క్లినర్ సుబ్రమణ్యం (26)ని కుక్క కరవడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం తన వీధిలో సంచరిస్తున్న పిచ్చి కుక్క నాలుగు రోజులు క్రితం కరవగా చికిత్స చేయించుకోకుండా నిర్లక్ష్యం వహించాడు. అతను వింత వింతగా ప్రవర్తించడంతో అతని భార్య హుటాహుటిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ కేసును సామర్లకోట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







