మరిడమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం

UPDATED 16th JULY 2019 TUESDAY 7:00 PM

పెద్దాపురం: భక్తుల కొంగుబంగారంలా విరాజిల్లుతున్న స్థానిక మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాడ శుద్ధ పౌర్ణమి తిథిని పురస్కరించుకుని మంగళవారం చండీహోమం వైభవంగా నిర్వహించారు. దేవస్థానం వేద పండితులు చిట్టెం హరిగోపాలశర్మ పర్యవేక్షణలో పవిత్ర మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, సామూహిక కుంకుమ పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ, వేదపండితులు ఐవీ ప్రసాద్ శర్మ, అధిక సంఖ్యలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us