UPDATED 4th JANUARY 2019 FRIDAY 10:00 PM
నిడదవోలు: స్థానిక శ్రీ రంగా సుబ్బారావు కాపు కల్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల, ఆసుపత్రి సౌజన్యంతో శుక్రవారం నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరాన్ని లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ కొత్తపల్లి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దంత సంరక్షణపై ప్రతీ ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఈ శిబిరంలో వైద్యుల బృందం సుమారు 200 మందికి దంత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి ఎల్. రమణకుమార్, వైద్యులు డాక్టర్ పి. అఖిల్, డాక్టర్ కె. శ్రీ చైతన్యరామ్, డాక్టర్ టి. ప్రశాంత్, డాక్టర్ డి. కృష్ణ, డాక్టర్ టి. బిందు శ్రీ మేఘన, డాక్టర్ ఎస్. వైదేహి, డాక్టర్ వి. విష్ణు, డాక్టర్ ఎండి అబీబా, పిఆర్వో కుమార్, తదితరులు పాల్గొన్నారు.







