UPDATED 28th OCTOBER 2020 WEDNESDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయలో 2021-22 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జంధ్యాల వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు 2020-21 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ 2018-19, 2019-20 సంవత్సరాల్లో వరుసగా మూడు, నాలుగు తరగతులు చదివి, 1-5-2008 నుంచి 30-04-2012 మధ్య జన్మించి ఉండాలన్నారు. అర్హత గల అభ్యర్థులు www.navodaya.gov.in వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ విధానంలో డిసెంబర్ నెల 15వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, జిల్లావ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాల్లో 10-4-2021న ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత భోజన, వసతి సదుపాయాలతో పాటు ఎన్.సి.సి, స్కౌట్స్ అండ్ గైడ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, మ్యూజిక్, ఆర్ట్, ఎస్.యు.పి.డబ్ల్యు, కంప్యూటర్స్, తదితర రంగాల్లో ఉత్తమ శిక్షణ ఇస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతూ వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న నవోదయ విద్యాలయాలకు దక్కుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.







