పట్టణంలో పైపులైన్ల గోతులను తక్షణం పూడ్చండి

UPDATED 29th AUGUST 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: పట్టణ పరిధిలో గల అన్ని వార్డుల్లో పైపులైను గుంతలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని వాటిని పూడ్చేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజస్ అన్నారు. మునిసిపల్ వైస్ చైర్మన్ మన్యం పద్మావతి అధ్యక్షతన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ గుంతలను కొన్ని వార్డుల్లోని పూడ్చడం సరికాదని, మిగిలిన వార్డుల్లో కూడా పూడ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ తొలి విడతగా కొన్ని వార్డులు పెట్టడం జరిగిందని, మిగతావి త్వరలో చేపడతామని అన్నారు. కౌన్సిలర్ ఆవాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బందికి వాహనాలు కొనుగోలుకు పొందిన రుణాన్ని ఏ ప్రాతిపదికన చేస్తారని, రుణాలను రికవరీ ఏ విధంగా వసూలు చేస్తారని ప్రశ్నించారు. దీనికి కమీషనర్ సమాధానమిస్తూ మున్సిపల్ సిబ్బంది పొందే వాహన రుణాన్ని వేతనాల నుంచి రికవరీ చేయడం జరుగుతుందని  అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us