శ్లాస్‌ పరీక్షలు పరిశీలన

UPDATED 27th FEBRUARY 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం వేట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న స్టూడెంట్‌ లెవెల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (శ్లాస్‌) పరీక్షలను మండల విద్యాశాఖాధికారి వైవి శివరామకృష్ణయ్య బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓఎంఆర్ షీట్లు పూర్తి చేసే విధానం, పరీక్షలు జరిగేతీరును ఆయన పరిశీలించారు. అనంతరం ఎంఈవో శివరామకృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, శ్లాస్‌ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారనేది తెలుసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పులపకూర జాన్,  సీఆర్పీలు నాగమణి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us